ప్రభాస్ సాహో లో ఊహించని సర్ప్రైజ్
- July 29, 2017
‘బాహుబలి’ లాంటి మెగా హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో’ గురించి ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ పనులు ఎప్పుడో మొదలు అయినా ప్రభాస్ ‘బాహుబలి’ బంధిఖాన నుండి విడుదల అవడానికి చాలా సమయం పట్టడంతో ఈ సినిమా ప్రారంభం ఆలస్యం అయిన విషయం తెలిసిందే.
ఎట్టకేలకు ఈ ఏడాది ‘సాహో' సెట్స్ మీదికి వెళ్లింది. 'సాహో' సెట్స్ మీదికి వెళ్ళడం ఈ చిత్ర ప్రి లుక్ పోస్టర్ ఫస్ట్ టీజర్ లాంచ్ చేసిన కొద్ది గంటలకే సంచలనాలు సృష్టించడంతో ఈ సినిమాలోని ప్రభాస్ పూర్తి స్థాయి లుక్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనితో ఉత్సాహం ఆపుకోలేని అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అంతేకాదు వాటిని సుజీత్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఒరిజినల్ లుక్ కోసం డిమాండ్ చేస్తున్నారు.
దీనితో ఈ ఒత్తిడి తట్టుకోలేక దర్శకుడు సుజిత్ ఆగస్టు 15న ఈ సినిమాకు సంబంధించిన సర్ప్రైజ్ ట్రీట్ ఒకటి ఉంటుంది అంటూ లీకులు ఇస్తున్నాడు. అయితే సర్ప్రైజ్ ట్రీట్ ఏమిటి అన్న విసయమై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇది ఇలా ఉండగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న సాహో సినిమాకు సంబంధించి ఇంకా మేకోవర్ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి అని తెలుస్తోంది. తాజాగా ప్రభాస్ లుక్ కు సంబంధించి మరో 3స్టిల్స్ బయటకొచ్చాయి. అయితే అవి ఈమధ్య విడుదలైన ఫొటోకు కొనసాగింపుగానే ఇవి ఉన్నాయి. తప్పితే వీటిలో కొత్త ఎలిమెంట్ ఏం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుస్తున్న మాచారం ప్రకారం ఈలుక్ నే ‘సాహో’ కోసం ఫిక్స్ చేస్తున్నారట. కానీ ఈసినిమాలో ఇది ఒక యాంగిల్ మాత్రమే అని అంటున్నారు. ఈసినిమా కథ ప్రకారం యాక్షన్ ఎపిసోడ్స్ టైమ్ లో మరో లుక్ కూడా ఉంటుందని టాక్.
మరోవైపు ‘సాహో’ సినిమాకు సంబంధించి హీరోయిన్ ను కూడా ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ కాకపోవడం కూడ ప్రభాస్ అభిమానులను కలవర పెడుతున్నట్లు టాక్. ఎందరో బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లను పరిశీలించినా ఇంకా ఎవ్వరు సెట్ కాలేదని తెలుస్తోంది. ఇప్పటికే ‘సాహో’ సినిమాకు సంబంధించి సెంట్రల్ లైబ్రరీలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు.
త్వరలోనే రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ షెడ్యూల్ మొదలవుతుంది అని అంటున్నారు. ఈ షెడ్యూల్ లోనే ప్రభాస్ జాయిన్ అవుతాడు అని టాక్. ఈ పరిస్థుతుల నేపధ్యంలో ప్రభాస్ అభిమానులు ఆగష్టు 15న బయట పడబోయేసర్ప్రైజ్ ట్రీట్ గురించి ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







