మల్టీ స్టారర్ చిత్రంలో వెంకటేష్, దగ్గుబాటి రానా .. తమిళ రీమేక్‌లో బాబాయి, అబ్బాయి
- July 31, 2017
తమిళంలో విక్రమ్ వేద అనే చిత్రం సంచలన విజయం దిశగా వెళ్తున్నది. ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం బ్రహ్మండమైన వసూళ్లను సాధిస్తున్నది. వీరిద్దరి నటనకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ సినిమాలో వెంకటేశ్, రానా నటించనున్నారనేది తాజా సమాచారం.
ఈ చిత్రం కోసం రానా దగ్గుబాటి, వెంకటేశ్‌ను సంప్రదించాం. వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. తమిళంలో ఆర్ మాధవన్ పోషించిన పాత్రను వెంకటేశ్, విజయ్ సేతుపతి నటించిన పాత్రకు రానాను అడుగుతున్నాం. విక్రమ్ వేద చూసిన తర్వాత మా మొదటి చాయిస్ వారేనని భావించాం అని ఓ చిత్ర యూనిట్ పేర్కొన్నది.
ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయి. దేనిపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో నెలరోజుల్లో ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను మీడియాకు అధికారికంగా వెల్లడిస్తాం అని ఓ చిత్ర యూనిట్ వెల్లడించింది.
విక్రమ్ వేద అనే చిత్రానికి పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించింది. విక్రమ్ భేతాళ కథల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విక్రమ్‌గా ఆర్ మాధవన్ నిజాయితీ ఆఫీసర్‌గా నటించారు. బేతాళుడి పాత్రలో విజయ్ సేతుపతి గ్యాంగస్టర్‌గా నటించారు.
తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలపై విక్రమ్ వేద చిత్ర నిర్మాత శశికాంత్ స్పందించారు. ఈ చిత్ర రీమేక్‌పై స్పందించడం తొందరపాటే అవుతుంది. చర్చలు జరుతున్నాయి. ఇంకా ఏది ఖారారు కాలేదు అని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు







