పాకిస్తాన్ లో బతకడం ఒక నరకం : పాక్ హిందువులు
- July 31, 2017
భారతదేశ విభజన అనంతరం మెజారిటీ ముస్లింలు అంతా కలసి పాకిస్తాన్ వెళ్లిపోయారు. అంతకు ముందు ముస్లింలు, హిందువులు అందరూ కలిసే ఉండేవారు. కొద్ది మొత్తంలో హిందువులు సైతం పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. అప్పటి నుంచే హిందువులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. మానసికంగా, శారీరకంగా హిందువులు అనేక హింసలను ఎదుర్కొంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70ఏళ్లనుంచి పాకిస్తాన్ నుంచి భారత్‌కు వలసలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. వేలాది మంది సరిహద్దుల వెంట టెంట్లు వేసుకొని ఉంటున్నారు. గస్తీ వాళ్ల కళ్లు కప్పి భారత్ చేరుకున్నా వారిభాషతీరు, వస్త్రధారణ తీరులతో సులభంగా అధికారులకు దొరికిపోతున్నారు. హిందువులు ఎక్కువగా ఉన్న భారత్ నుంచి వారికి ఇది ఊహించని షాక్.
1947 జరిగిన హింసల్లో 1.50 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇందులో మెజారిటీ సంఖ్యలో హిందువులు, సిక్కులు పాక్‌లో ఉండిపోయారు. పాక్ జనాభాలో సుమారు 1.6 శాతం మంది హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. ఎక్కువ శాతం మంది హిందువులు పాకిస్తాన్లో దాడులకు గురౌతున్నారు. హిందూ మహిళలపై అత్యాచారాలు, బలవంతపు పెళ్లిలు, మత మార్పిడులకు పాల్పడుతున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని హిందువులు ఖాళీ చేతులతో ఎడారి గుండా రాజస్తాన్‌కు వలస వస్తున్నారు. అక్కడి వాతావరణానికి సులభంగా అలవాటుపడి, తమ భాష, సంస్కృతిని మార్చుకుంటున్నారు. భారత్‌లో వలసవాదుల పరిస్థతి అత్యంత దయనీయంగా ఉంటోంది. శ్రమదోపిడీకి గురౌతున్నారు. ఎక్కువ శాతం మందికి ఉద్యోగం ఉండదు. డబ్బు ఉండదు. జీవనం కోసం పొలాల్లో రోజువారీ కూలీ చేసుకు బతకాల్సిందే. అంతే కాకుండా ఎక్కువ శాతం మంది జీవనాపాథికోసం రాళ్లు కొట్టే పనికి బలవంతంగా వెళ్తున్నట్లు 81ఏళ్ల జోగ్దాస్ తెలిపాడు. తన జీవితంలో ఓ ఒక్కరోజు తను ప్రశాంతంగా జీవించలేదని వాపోయాడు.
ఇందులో కూడా వలసవాదులు కొన్ని సమస్యలును ఎదుర్కొంటున్నారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలు తగ్గుతాయని భావించిన వలసవాదలకు నిరాశే ఎదురైంది. వలసవాదలకు ఉపశమనం కలిగించే ఏనిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1997లో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఖరన్రాంజీ మాట్లాడుతూ వలస వచ్చిన ఎనిమిదేళ్లకు తనకు 2005లో భారత పౌరసత్వం లభించినట్లు తెలిపాడు. చాలా మంది పాకిస్తానీయలు తిరగి పాకిస్తాన్ వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. వలసవాదులను భద్రతా బలగాలు, ఇంటలిజెన్స్ బృందాలు అనుమానితులుగా భావిస్తున్నారు.
తమ సంపాదనలో ఎక్కువ శాతం పోలీసు స్టేషన్ చూట్టూ తిరగడానికే ఖర్చు అవుతోందని వాపోయారు. తమ జీవితాలు కాపాడుకోవడానికి పాకిస్తాన్ నుంచి భారత్‌కు వలస వచ్చామని 65ఏళ్ల హరోజి తెలిపాడు. విభజన సమయంలో తన పెద్దలు తప్పుడు నిర్ణయంతో పాకిస్తాన్లో చిక్కుకుపోయామని ఆవేదన వ్యక్తంచేశాడు. పాకిస్తాన్‌నుంచి వలస వచ్చే హిందువులకు భారత ప్రభుత్వం భరోసా ఇవ్వాలని వలసవాదులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









