స్నాప్‌డీల్ లో భారీగా ఉద్యోగులపై వేటు
- July 31, 2017
ఫ్లిప్‌కార్ట్‌తో అతిపెద్ద విలీన చర్చలను రద్దు చేసుకున్న ఈ కామర్స్‌సంస్థ మరోసారి ఉద్యోగులపై భారీగా వేటువేయనుంది. భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్టు స్నాప్‌డీల్ సోమవారం ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 80శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్టు చెప్పింది. అలాగే స్నాప్‌డీల్ వ్యవస్థపాకులు కునాల్ బాల్, రోహిత్ బన్సల్ గత గురువారం సాయంత్రంమే ఈ కీలక ఆదేశాలను జారీ చేసినట్టు సమాచారం. తమ వ్యాపార, సాంకేతిక హెడ్లను తమ టీంను పునర్నిర్మించాలని, ఉద్యోగుల తొలగింపు కోసం పేపర్‌వర్క్‌ను ప్రారంభించాలని గట్టిగా సూచించినట్టు తెలుస్తోంది.
సంబంధిత విభాగాల హెడ్స్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సంస్థ సీనియర్ అధికారి ఒకరు ఐఎన్ఎస్కు చెప్పారు. ఈ తీసివేత జాబితాను సిద్ధం చేయాల్సిందిగా కోరినట్టు తెలిపారు. గత ఏడాది జూలైలో 9వేలమంది ఉద్యోగులను కలిగి వున్న స్నాప్‌డీల్ ఇటీవల ఈ సంఖ్యను 12వందలకు కుదించింది. దీంతో దేశీయ ఈకామర్స్ లో అతిపెద్దడీల్‌గా నిలవనుందని , తద్వారా తమ ఉద్యోగాలకుఢోకా ఉండదని భావించిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







