స్నాపీడీఎల్, ఫ్లిప్కార్ట్ మధ్య ఒప్పందానికి తెరపడింది
- July 31, 2017
ఒంటరిగానే వెళ్తామన్న స్నాప్‌డీల్
ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్స్ స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ మధ్య ఒప్పందానికి తెరపడింది. ఫ్లిప్‌కార్ట్‌తో విలీనానికి స్నాప్‌డీల్ నిరాకరించింది. దీనిపై జరుగుతున్న చర్చలను ఇకమీదట నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తాము ఒంటరిగానే తమ కార్యకలాపాలు చేపడతామని స్నాప్‌డీల్ సోమవారం వెల్లడించింది.
ఇటీవల స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ 900-950 మిలియన్‌డాలర్ల ఆఫర్‌ను ఇచ్చింది. దీనికి స్నాప్‌డీల్ బోర్డు అంగీకరించినట్లు గతవారం వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పిన స్నాప్‌డీల్ తాజాగా వాటిని నిలిపివేసింది. ‘కంపెనీ ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకుంది. విలీనంపై జరుగుతున్న అన్ని వ్యూహాత్మక చర్చలను నిలిపివేశాం’ అని ఫ్లిప్‌కార్ట్ పేరు చెప్పకుండానే స్నాప్‌డీల్ అధికార ప్రతినిధి ఈ-మెయిల్ ద్వారా వెల్లడించారు. స్నాప్‌డీల్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం ఫ్రీఛార్జ్‌ను యాక్సిక్ బ్యాంక్ కొనుగోలు చేసిన కొన్ని రోజులకే ఒప్పందానికి తెరపడటం గమనార్హం.
ఈ-కామర్స్ రంగంలో ఒకప్పుడు దూసుకెళ్లిన స్నాప్‌డీల్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ దెబ్బకు ఈ మధ్యకాలంలో చతికిలపడిపోయింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో సంస్థ విలీనానికి ఆరు నెలల కిందట చర్చలు ప్రారంభించింది. స్నాప్‌డీల్‌లోని అతిపెద్ద ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన 900-950 మిలియన్ డాలర్ల ఆఫర్‌కు కూడా బోర్డు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఒప్పందం కుదురుతుందని మార్కెట్ విశ్లేషకులు భావించారు. అయితే తాజాగా స్నాప్‌డీల్ ఇందుకు నిరాకరించింది. కాగా.. ఇటీవల ఫ్రీఛార్జ్‌ను రూ.385 కోట్లకు యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







