ఫేస్‌బుక్‌కు చాట్‌బోట్స్ షాక్
- July 31, 2017
టెక్ దిగ్గజం ఫేస్‌బుక్‌కు చాట్‌బోట్స్(ఇంటర్నెట్ ద్వారా మనుషులతో మాట్లాడటానికి ఉపయోగించే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్) షాక్ ఇచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో ఆ కంపెనీ తయారు చేసుకున్న చాట్‌బోట్స్ .. ఫేస్బుక్ ఉద్యోగులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించాయి. అంతేకాదు అవి సొంతగా అభివృద్ధి చేసుకున్న భాషలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడం ప్రారంభించాయి. దీంతో అవాక్కవడం ఫేస్బుక్ ఉద్యోగుల వంతైంది.
ఏం చేయాలో పాలుపోని చాట్‌బోట్స్ ఏఐను వెంటనే నిలిపేసింది ఫేస్బుక్. ఈ మేరకు ఓ అంతర్జాతీయ పత్రిక ఆదివారం కథనాన్ని ప్రచురించింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చాట్‌బోట్స్ ఫేస్బుక్ పరిశోధకుల మాట వినకుండా వాటి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినట్లు చెప్పింది. దీంతో షాక్‌కు గురైన పరిశోధకులు వెంటనే ఆ ఏఐను నిర్వీర్యం చేశారని తెలిపింది.
అయితే, చాట్‌బోట్స్ ఫేస్బుక్ ఆఫీస్‌లోని కంప్యూటర్లకు ఎలాంటి హాని తలపెట్టలేదని వెల్లడించింది. ఫేస్బుక్ పరిశోధకులు డీఫాల్ట్‌గా ఇచ్చిన ఇంగ్లీష్ భాషను వదిలేసి తన సొంతగా అభివృద్ధి చేసుకున్న మరొక భాషలో సంభాషించడం మొదలుపెట్టినట్లు వివరించింది. పరిశోధకులు ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఏఐకు సూచించినా.. ఆ సూచనలను ఏఐ ఖతరు చేయలేదని వెల్లడించింది. కాగా, టెస్లా మోటార్స్, స్పేస్ ఎక్స్ కంపెనీల యజమాని ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









