రవితేజ నటించిన రాజా ది గ్రేట్ టీజర్ డేట్

- July 31, 2017 , by Maagulf
రవితేజ నటించిన రాజా ది గ్రేట్ టీజర్ డేట్

బెంగాల్ టైగర్ మూవీ తర్వాత గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. సుప్రీమ్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో రాజా ది గ్రేట్ మూవీ తో పాటు కొంచెం టచ్ చేసి చూడు సినిమాలు చేస్తున్నాడు. ఇక రాజా ది గ్రేట్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న టీమ్ ముందుగా ఆగష్టు 15న టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.
మొదటిసారి రవితేజ ఈ మూవీ లో అంధుడిగా కనిపించబోతుండడం తో సినిమా ఎలా ఉంటుందా అని అంత ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' ఫేమ్ మెహరీన్ కౌర్ నటిస్తుండగా శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com