భారతలో కీలక వడ్డీరేటుపై ఆర్బీఐ గుడ్‌న్యూస్
- August 02, 2017
మెజార్టీ విశ్లేషకుల అంచనాల ప్రకారమే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని ప్రకటించింది. రెండు రోజుల సమావేశ నేపథ్యంలో మంగళవారం భేటీ అయిన గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ, కీలక వడ్డీరేటు రెపోను పావు శాతం తగ్గించినట్టు బుధవారం ప్రకటించింది. దీంతో ప్రస్తుతమున్న 6.25 శాతం రెపో రేటు, 6 శాతానికి దిగొచ్చింది. ప్రభుత్వ వర్గాల నుంచి పారిశ్రామిక ప్రతినిధుల నుంచి రెపో రేటు తగ్గింపునకు పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గత 10 నెలల కాలంలో మొట్టమొదటిసారి ఆర్బీఐ ఈ రేటు కోతను చేపట్టింది.
రెపో రేటు అంటే బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వడ్డీరేటు. ద్రవ్యోల్బణ భయాల కారణతో ఇన్నిరోజులు యథాతథ రేటును కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ, ఇటీవల ద్రవ్యోల్బణ గణాంకాలు తీవ్ర కనిష్ట స్థాయిలకు పడిపోవడంతో కోత నిర్ణయం ప్రకటించింది. ప్రతి పాలసీలోనూ మార్కెట్ వర్గాలను ఆర్బీఐ నిరాశపరుస్తూ వచ్చింది. కానీ ఈ పాలసీలో మార్కెట్లకు గుడ్‌న్యూస్ అందించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







