ట్యాప్ వాటర్‌తో కిడ్నీ సమస్య
- August 03, 2017
53 ఏళ్ళ భారతీయ వలసదారుడు జయన్, ట్యాప్ వాటర్ కారణంగా తనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయనీ, కిడ్నీ సమస్య తనను అనారోగ్యానికి గురిచేసిందనీ, తన గుండె పరిస్థితి కూడా ఏమంత బాగా లేదని ఆరోపిస్తున్నారు. జూన్ 16న జయన్, బహ్రెయిన్‌కి వచ్చారు. సేల్స్ రిప్రెజెంటేటివ్‌గా మంచి ఉద్యోగాన్ని తనకు ఆఫర్ చేశారనీ, ఇక్కడికి వచ్చాక తనకు ఆ కంపెనీ సరిగ్గా జీతం చెల్లించలేదనీ, ఆ కారణంగా ఆర్థిక ఇబ్బందులతో తన స్నేహితులు ఉండే ఇంట్లోకి వెళ్ళానని తన దీన గాధను వివరించారు. స్నేహితుల ఇంట్లో తినడానికి తిండి సరిగ్గా లేని పరిస్థితుల్లో బ్రెడ్ తిని, ట్యాప్ వాటర్ తాగాననీ అయితే ఆ ట్యాప్ వాటర్ తనను అనారోగ్యానికి గురిచేసిందని తెలిపారాయన. ఆసుపత్రికి వెళితే కిడ్నీ సమస్య తీవ్రంగా ఉంది గనుక, డయాలసిస్ చేయించుకోవాలని వైద్యులు ఆయనకి సూచించారట. సకాలంలో ఆసుపత్రికి వెళ్ళకపోయి ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని వాపోతున్నారు. తన స్నేహితులు కూడా ట్యాప్ వాటర్ తాగి అనారోగ్యానికి గురయ్యారనీ, అయితే తాగిన నీరు వాంతి అయిపోవడంతో వారికి చిన్న సమస్యలే తలెత్తగా, తనకు మాత్రం వాటర్ శరీరంలో కలిసిపోవడంతో అనారోగ్యం ఏర్పడిందని అన్నారు జయన్. సన్నిహితులు, కమ్యూనిటీ మెంబర్స్ సహాయంతో స్వదేశానికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు జయన్.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







