రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

- August 03, 2017 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

ఆసియాకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అల్‌ ఖైమాలో జరిగింది. రమ్స్‌ షమాల్‌ రోడ్‌పై ఈ ఘటన చోటు చేసుఉంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు కార్లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ - సెంట్రల్‌ ఆపరేషన్స్‌ రూమ్‌ డైరెక్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ సయీద్‌ అల్‌ హుమైది చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి అంబులెన్స్‌లు, పోలీసులు, పారామెడిక్స్‌ని అలాగే రెస్క్యూ టీమ్స్‌ని పంపించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ ప్రమాదం తర్వాత అగ్ని కీలలు వ్యాపించాయనీ, ఆ అగ్ని కీలల కారణంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వివరించారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు సూచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com