అమరావతిలో స్కూల్ పెట్టబోతున్న హీరో మహేషబాబు
- August 04, 2017
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమాలో ఓ మంచి డైలాగ్ ఉంది. 'ఊరి నుండి చాలా తీసుకున్నారు.. తిరిగి ఇచ్చేయ్యాలి.. లేకపోతే లావయిపోతారు..' నిజంగా మనం పుట్టి పెరిగిన ఊరికి ఎంతో కొంత చెయ్యాలనుకోవడం చాలా మంచి విషయం. ఇదే బాటలో పయనిస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ క్రమంలోనే తన సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రెపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు, అలాగే తెలంగాణాలోని సిద్ధాపూర్ గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిభగల పేద విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలతో ఓ మంచి స్కూల్‌ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. దీనికి సంబంధించిన ప్రచార బాధ్యతలన్నీకూడా తనే స్వయంగా చూసుకుంటాడట.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









