వ్యభిచార నియామకాలను నిర్వహిస్తున్న ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు
- August 04, 2017
మనామా : రాజధాని ప్రాంతంలో వివిధ ఫ్లాట్ల లో వరుస దాడులు నిర్వహించిన తరువాత ఇద్దరు బాంగ్లాదేశ్ పురుషులు నడుపుతున్న ఒక అనుమానిత వ్యభిచార కేంద్రం మరియు చట్టవిరుద్ధమైన మానవ శక్తి నియామకాల ( రిక్రూట్మెంట్ రాకెట్టు ) జరిపే ముఠాని పోలీసులు చేధించారు. "రాకెట్టు సభ్యులు చాలా మంది ఉద్యోగాల కోసం వీరి వద్దకు వచ్చినవారు కావడం గమనార్హం, వళ్ళు వంచి పనిచేస్త మంచి జీతం ఇస్తామని పలువురు కార్మికులను ప్రలోభ పెట్టారు. తమ తమ శక్తీ సామర్థ్యాలను బట్టి, వారి పనితనాన్ని బట్టి,200 బెహెరిన్ దినార్ల నుండి 300 బెహెరిన్ దినార్ల వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారిలో కొందరిని ఇతర 'యజమానులకు' విక్రయించారు, "కాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ హెడ్ మేజర్ మొహమ్మద్ ఖలీద్ అల్ బుయినైన్ ఈ విషయాన్ని " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధికి తెలిపారు. ఈ ఫ్లాట్లులలో ఇండోనేషియా, నేపాల్ నుండి అనేక మందితో పాటు శ్రీలంక మరియు భారతదేశంకు చెందినవారు ఉన్నారు. వారు మంచి వేతనాల చెల్లింపు కోసం వారి స్పాన్సర్ల నుండి పారిపోతున్నవారే అధికులనిపోలీసులు పేర్కొన్నారు. అక్రమంగా శుభ్రపరిచే వ్యాపారాన్ని నిర్వహించిన ఇద్దరు బంగ్లాదేశీయులు - వారి యజమానులచే వారు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వారు చెప్పారు. మహిళలను వ్యభిచారం కోసం ఉపయోగించబడ్డారని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రచురణ అల్ అమ్ లో ఒక నివేదిక వెల్లడించింది. "వీరిలో చాలామంది ఫేస్బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉన్నారు, దీని ద్వారా వారు కాబోయే ఖాతాదారులతో సంబంధాలను కొనసాగిస్తారు.వారు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా వేతనాలు, ఇతర నిబంధనలు, షరతులు, పని, జీవన సౌకర్యాలను చర్చలు వారికి వివరించి నియామకాలు జరుపుతున్నట్లు మేజర్ ఆల్ బుఇయినేన్ చెప్పారు.ఒక వారంలో నెలవారీ జీతం వంటి లాభదాయకమైన ఆఫర్లతో మహిళలకు ప్రవాసం కల్పించనుంది. వీరి ఆకర్షణకు లోనై చాలామంది తమ పని ప్రదేశాలను వదిలి వీరి ఉచ్చులో పడుతున్నట్లు మేజర్ ఆల్ బుఇయినేన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







