తమిళ హీరో జీవా కొత్త చిత్రం ఖరారు
- August 04, 2017
చిత్ర పరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడం కోసం శ్రమిస్తున్న నటుడు జీవా. దాదాపు 14 ఏళ్లుగా నటిస్తున్న ఆయనకు 'రామ్', 'డిష్యూం డిష్యూం', 'ఈ', 'శివ మనసుల శక్తి' 'కో', 'నన్బన్' చిత్రాలు హిట్లుగా నిలిచాయి. పలు ప్రయోగాత్మక చిత్రాలు చేసినప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వలేదు. అందులోనూ అయిదేళ్లుగా చాలా వరకు సినిమాలు పరాజయం పాలవుతూనే ఉన్నాయి. అయినా ప్రయోగాలను మాత్రం ఆయన ఆపడం లేదు. ప్రస్తుతం 'కీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. నిక్కీగల్రాణి కథానాయిక. కాళీస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది హ్యాకర్లకు సంబంధించిన కథాంశంతో రూపొందుతోంది. వెబ్‌సైట్లను సరదాగా హ్యాకింగ్ చేసే యువకుడిగా నటిస్తున్నారు జీవా. ఈ సినిమా మోషన్ ఫస్ట్‌లుక్‌ను నటుడు శింబు తాజాగా ఆవిష్కరించారు. కొన్ని సెకన్ల ఈ ఫస్ట్‌లుక్ హాలీవుడ్ టీజర్ తరహాలో ఉందని పలువురు అభినందిస్తున్నారు.
అర్థంకాని ఓ ప్రాంతంలో జీవా నుంచోని ఉన్నట్లు దీన్ని తయారు చేశారు. ఈ చిత్రమైనా ఆయనకు తగిన గుర్తింపు ఇస్తుందేమో వేచి చూడాలి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







