రోబోట్ల సేవలను పొందనున్నాదుబాయి విమానాశ్రయం
- October 21, 2015
దుబాయి విమానాశ్రయంలో రోబోట్ల సేవలు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శకులు త్వరలో దుబాయి విమానాశ్రయంలో తమ వీసా అవసరాలను పర్యవేక్షించే రోబోట్ల సేవలను పొందనున్నారు! అన్ని వీసా సేవలు కాకపోయినా, ట్రాన్సిట్ సందర్శకులు, వీసా-ఆన్-ఆరైవాల్ సదుపాయాన్ని పొందగోరిన వారు క్యూ లలో వేచిఉండనవసరం లేకుండా, వారి పేపర్ వర్క్ ను ఈ రోబోట్లు నిర్వహిస్తాయి. దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 మరియు 3 లలో, అల్ మక్తౌమ్ విమానాశ్రయం మరియు దుబాయి ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలలో మొత్తం 13 రోబోట్లు నియోగింపబడతాయని, ఇవి వీసా రెన్యూవల్ విజ్ఞప్తులను కూడా నిర్వహించగలవని, అందుకోసం నివాసితులు చేయవలసిందదల్లా - వారి ఎమిరేట్స్ ఐ. డి. లను స్వైప్ చేసి, అనంతరం సూచనలు పాటించడమేనని చెల్లింపులు తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా చేయవచ్చని జనరల్ డైరక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఆఫైర్స్ (గ్ద్ర్ఫా ) అధికారి ఒకరు ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న జి టెక్స్ టెక్నాలజీ వీక్ లోని రోబట్ ప్రదర్శన సందర్భంగా తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







