పోహా ఫింగర్స్
- August 07, 2017
కావలసినవి:
అటుకులు - ఒక కప్పు, ఆలుగడ్డలు- మీడియం సైజువి రెండు (ఉడికించి, నలిపి), జీలకర్ర పొడి - అర టీస్పూన్, పచ్చిమిర్చి - ఒకటి (సన్నగా తరిగి), కారం - అర టీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, ఆమ్‌చూర్ పొడి - ముప్పావు టీస్పూన్, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, బొంబాయి రవ్వ - అరకప్పు, నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు (పోహా ఫింగర్స్‌ను వేగించడానికి).
తయారీ:
పోహా(అటుకులు)ని శుభ్రంగా నీళ్లతో కడగాలి. కొన్ని నీళ్లు ఉంచి మిగతావన్నీ వంపేయాలి. పోహా రకాన్ని బట్టి నీళ్లను మిగల్చాలి. మందంగా ఉన్నవయితే పలుచటి కాస్త ఎక్కువ నీళ్లు ఉంచాలి. పెద్ద గిన్నెలో నానబెట్టిన అటుకులు, ఉడికించి పొడిగా నలిపిన ఆలుగడ్డల్ని వేసి ఉండలు లేకుండా కలపాలి. తరువాత జీలకర్ర పొడి, పచ్చిమిర్చి తరుగు, పసుపు, కారం, ఆమ్‌చూర్ పొడి, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పిండి ముద్దను ఎనిమిది లేదా పది భాగాలు చేయాలి. ఒక్కోదాన్ని సున్నితంగా నొక్కుతూ సిలిండర్ ఆకారంలో లేదా చేతి వేలి ఆకారంలో వత్తాలి.
తయారుచేసుకున్న ఒక్కో ఫింగర్‌ను బొంబాయి రవ్వలో దొర్లించాలి. పాన్ వేడిచేసి కొంచెం నూనె వేసి వేగించాలి. అన్నివైపులా బంగారు రంగులో వేగాక స్టవ్ ఆపేయాలి.
వేడివేడిగా టొమాటో సాస్‌తో తింటే టేస్టీగా ఉంటాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పోహా మెత్తగా అయ్యేవరకు మాత్రమే నానబెట్టాలి. ఎక్కువ నీళ్లు పోస్తే పిండి ముద్ద జారుగా అవుతుంది. దాంతో పోహా ఫింగర్స్ షేప్ సరిగా రావు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







