విస్తార విమానం లో రూ. 799కే విమానయానం
- August 07, 2017
విస్తార ‘ఫ్రీడం టు ఫ్లై’ ఆఫర్
విమానయాన సంస్థ విస్తార తాజాగా ‘ఫ్రీడం టు ఫ్లై‘ ఆఫర్ కింద రూ. 799కే విమాన ప్రయాణ టికెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఎకానమీ తరగతి టికెట్ చార్జీ రూ. 799 కాగా ప్రీమియం ఎకానమీ టికెట్ రేటు రూ. 2,099గా (ఇతరత్రా అన్ని చార్జీలూ కలిపి) ఉంటుందని పేర్కొంది. 48 గంటల పాటు వర్తించే ఈ ఆఫర్ బుధవారం అర్ధరాత్రితో ముగియనుంది. ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 19 మధ్య కాలంలో చేసే ప్రయాణాలకు ఈ స్కీమ్ టికెట్లు వర్తిస్తాయి. సెలవుల్లో గోవా, పోర్ట్ బ్లెయిర్, జమ్ము, శ్రీనగర్, కొచ్చి, అమృత్‌సర్, భువనేశ్వర్ తదితర ప్రాంతాలు సందర్శించాలనుకునే వారు ముందస్తుగా ప్రణాళిక వేసుకునేందుకు ఈ ఆఫర్ ఉపయోగపడగలదని కంపెనీ తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు కూడా ఈ టికెట్లు వర్తిస్తాయని విస్తార పేర్కొంది. శ్రీనగర్–జమ్ము రూట్‌లో టికెట్ చార్జీ అత్యంత తక్కువగా ఉంటుందని వివరించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







