ఉప్మా ముసుగులో హాట్ బాక్స్ లో 1.29 కోట్ల విలువైన డాలర్ల స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్

- August 07, 2017 , by Maagulf
ఉప్మా ముసుగులో హాట్ బాక్స్ లో 1.29 కోట్ల విలువైన డాలర్ల స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్

కాదేదీ కవితకు కనార్హం అన్నారు పెద్దలు.. కాదేదీ స్మగ్లింగ్ చెయ్యడానికి కనార్హం అంటున్నారు నేటి దుండగులు.. ఉప్మా ముసుగులో దుబాయ్ కు రూ.1.29 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ప్రయాణీకులను పూణే ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.. పుణె నుంచి దుబాయ్ కు వెళ్తున్నా నిశాంత్ అనే వ్యక్తి డాక్యుమెంట్లు అనుమానాస్పదం గా ఉండడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపద్యంలో లగేజీ లో ఉన్న హాట్ బాక్స్ బరువు ఎక్కువగా అనిపించిన అధికారులు ఆ హాట్ బాక్స్ ని తెరిచారు. హాట్ బాక్స్ లో ఉప్మా కనిపించింది.. ఆ ఉప్మా కింద 86,600 యూఎస్ డాలర్లు, 15,000 యూరోలు కంపించాయి. కాగా ఇదే విమానం లో దుబాయ్ కు పయనం అయిన మరో మరో మహిళ వద్ద ఉన్న హాట్ బాక్స్ లో ఉన్న ఉప్మా కింద రూ.86,200 డాలర్లు, 15000 యూరోలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకొన్నారు. కాగా ఇప్పటికే స్మగ్లింగ్ కోసం మిక్సీ, కుక్కర్ వంటి వాటిని వినియోగిస్తున్న విషయం విధితమే..  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com