దుబాయ్‌లో ఇండియన్‌ కాన్సులేట్‌ యోగా ఈవెంట్‌

- August 08, 2017 , by Maagulf
దుబాయ్‌లో ఇండియన్‌ కాన్సులేట్‌ యోగా ఈవెంట్‌

దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులూట్‌ జనరల్‌, యోదా ఈవెంట్‌ని శుక్రవారం సాయంత్రం నిర్వహించనుంది. ఆధ్మాత్మిక, అలాగే భౌతిక ప్రయోజనాలకోసం సహజయోగా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1970లో సహజ యోగాని శ్రీమతి మాతాజి నిర్మలా దేవి ఆవిష్కరించారు. అది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సహజయోగాని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా ఈ తరహా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని ఈవెంట్‌ ఆర్గనైజర్‌ చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావొచ్చు. అయితే, ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం ఫాలో ఆన్‌ ఈవెంట్‌ జరుగుతుంది. దీనికోసం ఎలాంటి ప్రీ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. బుర్‌ దుబాయ్‌లోని సింధి సెర్మోనియల్‌ హాల్‌లో శనివారం ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. సహజయోగాతో ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటవుతుందని నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com