దుబాయ్ లో బీచ్ లను సురక్షితంగా ఉంచేందుకు పోలీసులచే అవగాహన కార్యక్రమం

- August 09, 2017 , by Maagulf
దుబాయ్ లో  బీచ్ లను సురక్షితంగా ఉంచేందుకు పోలీసులచే అవగాహన కార్యక్రమం

 ఈ ఏడాది ఇప్పటివరకు దుబాయ్ బీచ్ ల వద్ద సముద్రంలో మునిగిపోయి 6 గురు  మరణించారు.   గత ఏడాదిలో 29 మంది సముద్రంలో మునిగి చనిపోయారని దుబాయ్ పోలీసులు మంగళవారం తెలిపారు.  పోర్ట్ లకు సంబంధించి పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగ్రేడియర్ అబ్దుల్ ఖాదర్ అల్ బన్నై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీచ్ వినియోగదారులకు వాటిని ఏ విధంగా సురక్షితంగా ఉంచుకోవాలో తెలియచెప్పేందుకు పోలీసులు ఒక అవగాహన ప్రచార కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. గత ఏడు నెలల వ్యవధిలో సముద్రంలో మొత్తం తొమ్మిది మంది మునిగిపోగా వారిలో ఆరుగురు మృతి చెందారని, మరో ముగ్గురు స్వల్ప గాయాలతో రక్షించబడినట్లు దుబాయ్ పోలీసుల గణాంకాలు వివరిస్తున్నట్లు ఆయన చెప్పారు. సముద్రంలో   మునిగిపోతున్న సంఘటనల సంఖ్య క్రమేపి తగ్గిపోయినట్లు ఉదహరిస్తున్నారు. గత ఏడు నెలల్లో, ఆరు మరణాలు మరియు ముగ్గురు గాయపడిన ఘ్హతనాలు మాత్రమే సంభవించాయని పేర్కొంది. గత ఏడాది 35 మంది సముద్రంలో మునిగిపోయిన సంఘటనలలో 29 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరుగురు గాయాలతో బతికినట్లు తెలిపారు.దుబాయ్ తీరాలలో నీటిలో మునిగిపోతున్న సంఘటనలు నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా బీచ్ వినియోగదారులకు ఒక  కొత్త అవగాహన ప్రచారం ప్రారంభించామని ఆయన వివరించారు.  ఈ సంవత్సరం, ఇప్పటివరకు దుర్ఘటనలు మరియు మరణాల సంఖ్య బాగా తగ్గిపోయందని దుబాయిలో  సురక్షితమైన బీచ్ లు ఉండాలని మేము కోరుకుంటున్నామని బ్రిగేడియర్ అల్ బన్నై అన్నారు. ఒక వారం రోజుల పాటు జరిగిన ఈ  ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బీచ్ సందర్శకులు రాత్రి సమయంలో సముద్రంలో ఈత కొట్టడం కోరి ప్రమాదాలను ఆహ్వానించడమేనని ఆయన అన్నారు. సముద్రంలోనికి దిగేముందు తాజా వాతావరణ పరిస్థితులను ఓ మారు తనిఖీ చేసుకోవాలని కోరారు.ఈ  ప్రచారంలో 62 మంది వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను తమని విడిచి ఎక్కడకు వెళ్లకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వారిని ఎన్నడూ  ఒంటరిగా ఈత కొట్టనివ్వకూడదని ఆయన సూచన చేశారు. ."తల్లిదండ్రులు వారి పిల్లలను ఒకవేళ ప్రోతసహించాలని అనుకొంటే  లైఫ్ జాకెట్లను ఉపయోగించేలా చూడాలని అన్నారు. అలాగే  సముద్రం ఒడ్డున ఖరీదైన వస్తువులను వదిలి ఈతకు వెళ్ళరాదని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com