తీవ్రవాదులు, క్రిమినల్స్‌ నుంచి ఉపశమనం

- August 10, 2017 , by Maagulf
తీవ్రవాదులు, క్రిమినల్స్‌ నుంచి ఉపశమనం

అల్‌ అవామియా, ఈస్టర్న్‌ ప్రావిన్స్‌: సౌదీ స్పెషల్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌, తీవ్రవాదులు మరియు క్రిమినల్స్‌ ఏరివేత ఆపరేషన్‌ని విజయవంతంగా పూర్తి చేశాయి. షిటీ మెజార్టీ విలేజ్‌లో తీవ్రవాదులు నక్కి, కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, నెలల తరబడి ఉంటోన్నవారిపై సెక్యూరిటీ ఫోర్సెస్‌ అద్భుతమైన పోరాట పటిమతో ఆపరేషన్‌ని విజయవంతం చేయడం జరిగింది. గత నాలుగు రోజులుగా జరిగిన తాజా ఆపరేషన్‌లో, పలువురు తీవ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మే నెలలో సాయుధ మిలిటెంట్లు 400 ఏళ్ళ చరిత్ర కలిగిన అల్‌ అవామియాలోని అల్‌ ముసావారా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు తీవ్రవాదులు. ఇలాంటి ప్రాంతంలో ఆపరేషన్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకుని, తీవ్రవాదుల్ని మట్టుబెట్టామనీ, ఇకపై ఇక్కడి ప్రజలెవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భద్రతా దళాలు తెలిపాయి. ముందస్తుగా ప్రజల్ని ఖాళీ చేయించి, వారికి పునరావాసం కల్పించి, ఆ తర్వాత ఆపరేషన్‌ని చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com