గోబీ కోఫ్తా కర్రీ

- August 11, 2017 , by Maagulf
గోబీ కోఫ్తా కర్రీ

కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్‌: మీడియం సైజుది, టమోటాలు: మూడు(ముక్కలు చేసుకోవాలి), ఉల్లిపాయలు: రెండు(చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), మొక్కజొన్న పిండి: 50 గ్రాములు, పచ్చిమిరపకాయలు: మూడు లేదా నాలుగు, కారంపొడి: రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌ స్పూన్లు, టమోటా సాస్‌: మూడు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర: మూడు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత, కొత్తిమీర: కొద్దిగా, శనగపిండి: 50 గ్రాములు 
తయారీ విధానం: కాలీఫ్లవర్‌ను విడదీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో శనగపిండి, మొక్క జొన్న పిండి, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్ర, ఉప్పు వేసి కొద్దిగా గంటెజారుగా కలుపుకోవాలి. బాండీలో తగినంత నూనె పోసి కాగిన తరువాత పై మిశ్రమంలో ముక్కలు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టు కోవాలి. 
ఉల్లిపాయ ముక్కలు కొన్నింటిని, టమోటా ముక్కలను కలిపి ముద్దగా చేసుకొని అదే నూనెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన కారం, టమోటా సాస్‌, రుబ్బిపెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఇది గట్టిపడుతున్న సమయంలో వేయించిపెట్టుకున్న కాలీఫ్లవర్‌ ముక్కలను జత చేసుకోవాలి. సన్నపు సెగన కూర గట్టిపడేంత వరకూ ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. ఇది వేడి వేడి అన్నం లేదా చపాతీల్లోకి మంచి రుచిగా వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com