కృష్ణాష్టమికి మొదలుకానున్న మహేశ్‌ 25వ చిత్రం

- August 13, 2017 , by Maagulf
కృష్ణాష్టమికి మొదలుకానున్న మహేశ్‌ 25వ చిత్రం

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రస్తుతం ఏ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో 'స్పైడర్‌', కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్‌ అనే నేను' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన 25 చిత్రం మొదలుకాబోతోంది. సోమవారం కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈ చిత్ర వివరాలను ప్రకటించనున్నారు.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. అశ్విని దత్‌, దిల్‌రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. అశ్విని దత్‌ నిర్మాతగా వ్యవహరించిన 'రాజకుమారుడు' చిత్రంతో మహేశ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహపూర్వక బంధం ఉంది. ఇప్పుడు రాబోతున్న మహేశ్‌ 25వచిత్రాన్ని రేపు పూజాకార్యక్రమంతో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మహేశ్‌ భార్య నమ్రత శిరోద్కర్‌ హాజరుకానున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com