ధరల మాయ: ఎంఇసి కొరడా
- August 13, 2017
ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనమిక్ అండ్ కామర్స్, జులైలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 128 ఉల్లంఘనల్ని గుర్తించి, చర్యలు చేపట్టింది.ధరల మానిప్యులేషన్, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన వంటివి ఈ తనిఖీల్లో అధికారులు గుర్తించారు. గుర్తించిన 128 ఉల్లంఘనలకు సంబంధించి భారీగా జరీమానాలు కూడా ఆయా సంస్థలకు విధించడం జరిగింది. అరబిక్‌లో ఇన్వాయిస్లు ఇవ్వకపోవడం, ప్రోడక్ట్స్‌కి సంబంధించిన డేటా, డిస్క్రిప్షన్ పేర్కొనకపోవడం, ప్రోడక్ట్స్ విక్రయం విషయంలో వినియోగదారుల్ని మోసగించడం, ప్రైస్ ట్యాగ్స్ లేకపోవడం, గడువు తీరిన ప్రోడక్ట్స్‌ని విక్రయించడం, ప్రకటించిన ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరపడం వంటి ఉల్లంఘనలు ఇందులో ఉన్నాయి. ఈ ఉల్లంఘనలకుగాను 5,000 ఖతారీ రియాల్స్ నుంచి 30,000 ఖతారీ రియాల్స్ వరకూ జరీమానా విధించారు. మొత్తం 1,322 ఫిర్యాదులు రాగా, వాటన్నిటినీ మినిస్ట్రీ రిజాల్వ్ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









