యూఏఈ, సౌదీ, ఒమన్ ఆపరేషన్స్‌లో డ్రగ్స్ పట్టివేత
- August 15, 2017
డ్రగ్స్ ట్రాఫికర్స్ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని ఈ ఏడాది ఇప్పటిదాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్ సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్లలో 12 మంది డ్రగ్ డీలర్స్ అరెస్ట్ అయ్యారు. 158 కిలోల కన్నాబిస్, 2.7 మిలియన్ల పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డ్రగ్స్ వ్యతిరేకంగా యూఏఈ పోరాడుతోందనీ, ఈ క్రమంలో పొరుగుదేశాలకు సహకారం అందించడంతోపాటు, వారి నుంచీ సహకారం తీసుకుని, ఉమ్మడి పోరాటం డ్రగ్స్‌పై చేస్తోందని ఫెడరల్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్, యాంటీ నార్కోటిక్స్ కౌన్సిల్ ఛైర్మన్ కల్నల్ సయీద్ అబ్దుల్లా అల్ సువైది చెప్పారు. యెమెన్ నుంచి యూఏఈకి ఒమన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నవారి నుంచి 50 కిలోల కన్నాబిస్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఒమన్ పోలీసుల సహకారం మరువలేనిదని చెప్పారు అధికారులు. మరో ఆపరేషన్‌లో యూఏఈ ద్వారా సౌదీ అరేబియాలోకి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా ఆ యత్నాన్ని భగ్నం చేశారు. డ్రగ్స్‌పై అంతర్జాతీయ స్థాయి పోరాటం సత్ఫలితాలనిస్తుందని కల్నల్ సౌద్ అల్ కువైటి చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







