ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ బేఖాతర్
- August 15, 2017
అబుదాబీ: 30 ఏళ్ళ లోపు మహిళలు మెయిడ్స్‌గా పనిచేయడానికి వీల్లేదంటూ ఖచ్చితమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు భారతదేశంలో ఉన్నా, ఆ నిబంధనల్ని బేఖాతరు చేస్తూ విజిట్ వీసాతో యూఏఈలోకి ప్రవేశించి, ఆ తర్వాత మెయిడ్స్‌గా మారుతున్న 30 ఏళ్ళలోపు మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్కడ వారికి అనేక సమస్యలు తలెత్తడంతో, యజమానిపై ఆరోపణలు చేస్తూ, అధికారుల సహాయం కోరుతుండడంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి నెలా ఇలాంటి కేసులు 15 నుంచి 20 వరకు తమ దృష్టికి వస్తున్నాయని కాన్సులర్ ఆఫ్ కమ్యూనిటీ ఎఫైర్స్, ఇండియన్ ఎంబసీ - అబుదాబీ దినేష్‌కుమార్ చెప్పారు. ఇండియన్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ కాని కొందరు ఏజెంట్స్ ఈ తరహా అక్రమాలకు తావిస్తున్నట్లు ఆయన వివరించారు. నిబంధనల్ని మరింత కఠినతరం చేయడంతోపాటుగా, మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సి ఉందనీ, తమ దృష్టికి వచ్చే కేసుల పరిష్కారంలో మానవీయ కోణంతో వ్యవహరిస్తున్నామని తెలిపారు కుమార్.
తాజా వార్తలు
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









