600 మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు
- August 18, 2017
హమాద్ మెడికల్ కార్పొరేషన్, నేషనల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్ (ఎన్సిసిఆర్) వద్ద కొత్త బ్రెస్ట్ కేర్ క్నిఇక్ని ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్ ఏర్పాటయినప్పటినుంచి ఇప్పటిదాకా 600 మందికి పైగా మహిళలకు పరీక్షల్ని నిర్వహించారు. ట్రిపుల్ ఎస్సెస్మెంట్ టెస్ట్ ద్వారా ఈ పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ ఇమేజింగ్, కోర్ బయాప్సీ వంటివి ఇందులో భాగం. ట్రిపుల్ ఎస్సెస్మెంట్ విధానం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో క్యాన్సన్ని ముందుగానే గుర్తించగలమనీ తద్వారా చికిత్స తేలికవుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. క్లినిక్‌ని మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ హనామ్ మొహమ్మద్ అల్ కువారి ప్రారంభించారు. ఖతార్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో సర్వసాధారణంగా మారిపోయిందని, ప్రపంచ వ్యాప్తంగానూ మోస్ట్ కామన్ క్యాన్సర్స్‌లో రెండోదిగా గుర్తింపు పొందిందని వైద్యులు వెల్లడించారు. అయితే సకాలంలో గుర్తిస్తే బ్రెస్ట్ క్యాన్సర్‌ని సమర్థవంతంగా అడ్డుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









