వెన్ను శస్త్ర చికిత్స పూర్తయిన వెంటనే .. ఎమిరేతీ మహిళ ఇంటికి నడిచివెళ్ళింది ..

- August 20, 2017 , by Maagulf
వెన్ను శస్త్ర చికిత్స పూర్తయిన వెంటనే .. ఎమిరేతీ మహిళ ఇంటికి నడిచివెళ్ళింది ..

షార్జా  :  యూఏఈలోని షార్జా నగరంలో ఉన్న యూనివర్సిటీ హాస్పిటల్ షార్జా హాస్పిటల్‌కు ఫాతిమా అనే 40 ఏళ్ల మహిళ తీవ్రమైన వెన్నునొప్పితో  వెళ్లింది. పరిస్థితిని గమనించిన వైద్యులు ఎంఆర్‌‌ఐ పరీక్ష చేయించి సమస్యను గుర్తించారు. ఆమె వెన్నుముకలో ఓ కణితిని గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు కణితిని తొలగించారు. సర్జరీ జరిగిన మరసటే రోజే అద్భుతం జరిగింది. అనూహ్యరీతిలో ఫాతిమా నడవడం ప్రారంభించింది. చాలా వేగంగా కోలుకుంటుండడంతో రెండు రోజుల్లోనే ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ చేశారు. తనను తిరిగి నడవడానికి సహకరించిన వైద్యులకు ఫాతిమా ధన్యవాదాలు తెలుపింది. త్వరగా కోలుకోవడంపట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఫాతిమా కోలుకోవడంపై వైద్యులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com