ప్రముఖ నేపద్య గాయకుడు జేసుదాసు దంపతులు శబరిమల అయ్యప్పను దరిశించుకున్నారు

- August 22, 2017 , by Maagulf
ప్రముఖ నేపద్య గాయకుడు జేసుదాసు దంపతులు శబరిమల అయ్యప్పను దరిశించుకున్నారు

ప్రముఖ నేపద్య గాయకుడు జేసుదాసు పవిత్ర పుణ్య క్షేత్రం శబరిమల దర్శనం చేసుకొన్నారు.. అయ్యప్ప స్వామి పాటలు జేసుదాసు గళం నుంచి వెలువడితేనే అవి వీనుల విందు.. అటువంటి ఏసుదాసు ఇప్పటికే శబరిమల చాలా సార్లు వెళ్లారు.. అయ్యప్ప ను దర్శించుకొన్నారు. కానీ ఈ సారి ఏసుదాసు తన భార్య ప్రభతో కలిసి వెళ్ళడం విశేషం.. ఈ దంపతులు ఇద్దరూ కలిసి స్వామిని నెయ్యి అభిషేకం చేశారు.. అంతేకాదు.. ఆలయం మూసివేసే సమయంలో ఆయన "హరివారాసనం" అనే పాను కూడా ఆలపించారు.. ఈ సందర్భంగా జేసుదాసు మాట్లాడుతూ... స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందం ఇస్తుందని... చాలా ప్రశాంతంగా ఉందని.. ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేమని అన్నారు. కులం, మతం అనే ప్రసక్తి లేకుండా అందరి భక్తులను సమానంగా చూసే ఏకైక పుణ్య క్షేత్రం శబరిమల అని చెప్పారు.. కాగా జేసు దాసు అసలు పేరు ఏసుదాసు... తన పేరుని జేసుదాసు గా మార్చుకొని ఎన్నో హిందూదేవుళ్ళ భక్తి గీతాలను.. ఆలపించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com