గత వారం జరిగిన కాల్పుల్లో బార్సిలోనాలో తీవ్రవాదులకు జైలు
- August 23, 2017
గత వారం జరిగిన బార్సిలోనా తీవ్రవాద దాడి అనంతరం నిర్బంధంలోకి తీసుకున్న నలుగురిలో ఇద్దరికి ఏకాంత కారాగార వాస శిక్ష విధిస్తూ నేషనల్ కోర్టు (ఎఎన్) న్యాయమూర్తి ఫెర్నాండో ఆండ్రూ తీర్పు చెప్పారు. శిక్ష కాలంలో వారికి బెయిల్ కూడా లభించదు. గత గురువారం బార్సిలోనా, కాంబ్రిల్స్‌ల్లో జరిగిన దాడుల్లో 15మంది మరణించగా, వందమందికి పైగా గాయపడ్డారు. ఆ దాడులకు పాల్పడిన జిహాదీస్ట్ సెల్ సభ్యులుగా భావిస్తున్న మహ్మద్ హులీ చెమ్‌లాల్, డ్రిస్ ఒకబిర్‌లకు న్యాయమూర్తి శిక్ష విధించారు. తీవ్రవాద సంస్థలో చేరడం, హత్యలు వంటి అభియోగాలను వారిపై మోపారు. రిపోల్ పట్టణంలో చిన్న టెలిఫోన్ కాల్ సెంటర్ నడుపుతున్న సాలాV్‌ా ఎల్ కరీబ్‌కు ఈ దాడుల్లో గల పాత్రపై నిర్ధారణకు వచ్చేవరకు శిక్ష విధించే విషయమై 72గంటల పాటు న్యాయమూర్తి తన నిర్ణయాన్ని నిలుపు చేశారు. చివరకు అతనిని వదిలిపెట్టారు. కరీబ్‌పై చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







