యెమెన్‌ ఉత్తర ప్రాంతంలో వైమానిక దాడి.. 30 మంది మృతి

- August 23, 2017 , by Maagulf
యెమెన్‌ ఉత్తర  ప్రాంతంలో వైమానిక దాడి.. 30 మంది మృతి

యెమెన్‌లో రెబల్స్ ఆధీనంలో ఉన్న రాజధాని సానాపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 30 మంది మృతిచెందినట్లు తెలుస్తున్నది. సానాలోని ఉత్తర శివారు ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తొలిగించేందుకు రెడ్ క్రాస్ ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్న హౌతి రెబల్స్ ప్రస్తుతం సానాలో తిష్టవేశారు. వైమానిక దాడుల్లో మరో 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని హాస్పటళ్లో చేర్పించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com