యెమెన్‌లో సౌదీ సంకీర్ణ సేనల దాడులో 60 మంది మృతి, హోటల్ ధ్వంసం

- August 23, 2017 , by Maagulf
యెమెన్‌లో సౌదీ సంకీర్ణ సేనల దాడులో 60 మంది మృతి, హోటల్ ధ్వంసం

-60 మంది మృతి, హోటల్ ధ్వంసం
 సౌదీ అరేబియా సారథ్యంలోని సంకీర్ణ సేనలు యెమెన్‌లోని షియా హుథీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని బుధవారం ఉదయం జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 60 మంది మృతి చెందారు. అర్హాబ్ పట్టణంపై జరిగిన ఈ దాడుల్లో హుథీ తిరుగుబాటుదారులతోపాటు పౌరులు కూడా మృతి చెందారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో ఖ్వా అల్ ఖ్వైదీలోని రెండంతస్తుల హోటల్ భవనం కూడా కూలిపోయింది. ఆ సమయంలో హోటల్‌లో ఉన్నవారు మృత్యువాత పడ్డారని, మృతదేహాలు శిథిలాల కిందే చిక్కుకున్నాయంటున్నారు. ఈ హోటల్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో హుథీలు నిర్వహిస్తున్న చెక్‌పోస్ట్‌పైనా వైమానిక దాడులు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com