లండన్ లో రికార్డ్ కెక్కిన 153.1 కిలోల భారీ సమోసా

- August 24, 2017 , by Maagulf
లండన్ లో రికార్డ్ కెక్కిన 153.1 కిలోల భారీ సమోసా

153.1 కిలోల తో తయారు చేసిన సమోసా ప్రపంచంలోనే అతి పెద్ద సమోసా గా రికార్డ్ కెక్కింది. ఈ సమోసాను లండన్ లోని ఓ మసీదు వద్ద కొందరు వాలంటీర్లు మంగళవారం రోజున తయారు చేశారు. గతంలో ఇంగ్లాండ్ లో ఓ కాలేజీ వారు తయారు చేసిన 110.8 కిలోల బరువైన సమోసా రికార్డ్ ని ఈ సమోసా బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు సర్టిఫికేట్ ఇచ్చారు.. అంతేకాదు పెద్ద సమోసా కదా రుచిగా ఉండదు అని అనుకొంటే పొరపాటే.. చాలా టేస్టీగా ఉందని పొగడ్తలతో ముంచేశారు. కాగా ఈ పెద్ద సమోసా తయారీ విషయం పై ఆర్గనైజర్ ఇస్లాం స్పందిస్తూ.. తాము మొదట అసలు ఇంత పెద్ద సమోసా చేయగలుగుతామా అని మొదట సందేహించినట్లు... కానీ వెనకడుగు వేయకుండా తాము అనుకొన్న లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com