భారతీయ నగరాల్లో ఉండే యూఏఈ పౌరులకు హెచ్చరిక

- August 28, 2017 , by Maagulf
భారతీయ నగరాల్లో ఉండే యూఏఈ పౌరులకు హెచ్చరిక

న్యూఢిల్లీ:  న్యూ ఢిల్లీలోని యుఎఇ దౌత్యకార్యాలయం భారతదేశంలో ఉండే  ఎమిరాటీ పౌరులకు సలహా ఇచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రద్దీగా ఉన్న ప్రాంతాల నుంచి  తమ దేశ పౌరులు దూరంగా ఉండాలని కోరింది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం డేరా బాబా అరెస్ట్ తర్వాత జరిగిన హింసాకాండలో కనీసం 36 మంది మరణించారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి  జగదీప్ సింగ్  ఈ కేసులో తన తీర్పుని ఇస్తూ డేరా ముఖ్యఅధిపతి  గుర్మీత్ రామ్ రహీం సింగ్  2002 లో ఇద్దరు మహిళా శిష్యులను అత్యాచారం  చేసి లైంగికంగా దోపిడీకి పాల్పడిన కేసులో నిందితుడు. ఈ వ్యక్తికి  వందలాదిమంది అనుచరులు ఉన్నారు. వీరిలో 36 మంది బాధితులు, పంచకులలో 30 మంది మరణించారు,సిర్సా పట్టణంలో ఆరుగురు మరణించారు. ఇప్పటివరకు  ఈ హింసాకాండలో దాదాపు 250 మందికి పైగా  గాయపడ్డారు. జాతీయ రాజధానిలోని 11 నుంచి  13 పోలీసు జిల్లాల్లో హింసాసకాండను అణిచివేసేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నేషనల్ న్యూస్ చానెల్ నుండి ఆ ప్రాంతానికి వచ్చిన మీడియా బృందంపై సైతం   దేరా సచ సౌద యొక్క అనుచరులు దాడి చేశారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com