అఖిల్ 'హలో' టైటిల్‌కు నాగ్ కారణం అటా..!

- August 28, 2017 , by Maagulf
అఖిల్ 'హలో' టైటిల్‌కు నాగ్ కారణం అటా..!

అఖిల్ రెండో సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే ప్రశ్నను అక్కినేని నాగార్జున సమాధానం ఇచ్చారు. ఎంతో ప్లాన్డ్ గా సినిమా తీసే డైరెక్టర్ ...క్రియేటివ్ థాట్స్ కు ప్రాణం పోసే డైరెక్టర్ విక్రమ్ అని ఇటీవల రివీల్ చేశాడు. అలాగే సినిమాకు హలో అనే టైటిల్ కూడ రిజిస్టర్‌ చేయించాడు. కాగా ఈ సినిమాకు హలో అని టైటిల్ ఎందుకు సెలక్ట్ చేశారో తాజాగా వివరణ ఇచ్చారు. 

రేపు అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. తన బర్తడే సందర్బంగా విలేకర్లు ఆయనతో సరదాగా ముచ్చటించారు. ఈ నేపధ్యంలో అక్కినేని అఖిల్ సినిమా టైటిల్ గురించి మాట్లడుతూ...  ఈ టైటిల్‌ సినిమాకి చాలా అవసరం. తను ప్రేమించిన అమ్మాయి దగ్గర నుంచి ఒక హలో కోసం వెయిట్‌ చేస్తుంటాడు. ఆ కాన్సెప్ట్‌నే టైటిల్ గా పెట్టాలని డిసైడ్ అయ్యా. ఆరు నెలల నుంచి యూనిట్‌ అంతా ఏం టైటిల్‌ పెట్టాలని ఆలోచిస్తున్నారు. మీడియాలో కూడా ఎన్నో టైటిల్స్‌ వచ్చాయి. ఇది కాకుండా ఏదైన మంచి టైటిల్ తారసపడుతుందని వెయిట్ చేసా....కానీ ఏదీ నచ్చలేదు. దీంతో మైండులో అల్రెడీ రిజిస్టర్ అయిన టైటిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా.  కానీ 'హలో' టైటిల్‌ ను ఎవరో ఒకరు రిజిస్టర్‌ చేయించేసి వుంటారనుకున్నాను. కానీ, ఒక్కరు కూడా చేయలేదు. దీంతో రిలాక్స్ గా నేను అనుకున్న టైటిల్ ను రిజిస్టర్ చేయించా. అలాగే అఖిల్ రెండో సినిమా షూటింగ్ కొంత వరకు తెరకెక్కించాం. ఇదీ కూడా భారీ బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నాం. ఎక్కువ టైమ్ హీరోయిన్ సెలక్షన్ కోసం కేటాయించాం. ఫ్రెష్‌గా వుండాలి అనుకున్నాం. గీతాంజలిలో గిరిజలా, ఏమాయ చేసావెలో సమంతలా కొత్తగా వుండాలనుకున్నాం. చివరికి ప్రియదర్శన్ గారి అమ్మాయి కళ్యాణిని సెలెక్ట్ చేశాం. ఇక నా విషయానికి వస్తే...అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతకంటే నేనేం చెప్పగలను. నాన్నగారి నుంచి ఇప్పటివరకు అన్ని సందర్భాల్లోనూ మాకు సపోర్ట్‌గా ఉన్నారు. వాళ్ళు మాపై చూపిస్తున్న ఆదరణ, అభిమానం ఎప్పుడూ మర్చిపోను. అభిమానులే మాకు పెద్ద వరం అంటూ ఇంటర్వ్యూ ముగించారు కింగ్‌ నాగార్జున.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com