భారత రైల్వే ప్రయాణికుల కోసం హెల్ప్‌లైన్ నంబర్
- August 28, 2017
ముంబయి: రైళ్లల్లో తరచుగా చోరీలు, దాడులు, ఆకతాయిల ఆగడాలతో ప్రయాణికులు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమ రైల్వే జోన్ కేంద్రస్థానమైన ముంబయిలో గవర్నమెంటు రైల్వే పోలీసులు(జీఆర్పీ) ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సర్వీసు ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉందని వారు తెలిపారు.
రైళ్లల్లో, రైల్వే ప్లాట్‌ఫారాలపై జరిగే నేరాలను అరికట్టేందుకు 1512 హెల్ప్‌లైన్ నంబర్‌ను వారం రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తున్నట్లు స్థానిక జీఆర్పీ అధికారి ఒకరు తెలిపారు. కదులుతున్న రైల్లో ప్రయాణికులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే వారు 1512కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే చాలు. రైలు తదుపరి స్టేషన్‌కు చేరుకునే సమయానికి అక్కడ పోలీసులు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే ఈ సర్వీసు దేశంలో పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. రైళ్లల్లో నేరాలను తగ్గు ముఖం పట్టించాలన్న ఉద్దేశంతోనే ఈ హెల్ప్‌లైన్ నంబర్ని తీసుకువచ్చినట్లు అధికారి వివరించారు.
జీఆర్పీలో ఉద్యోగుల కొరత ఉన్నప్పటికీ ఈ సర్వీసును విజయవంతంగా నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది దోపిడీ కేసులు 35శాతం తగ్గాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







