టెక్సాస్‌లో హరికేన్‌ హార్వే ధాటికి నిరాశ్రయులైన 60లక్షల మంది

- August 28, 2017 , by Maagulf
టెక్సాస్‌లో హరికేన్‌ హార్వే ధాటికి నిరాశ్రయులైన 60లక్షల మంది

హరికేన్‌ హార్వే ధాటికి టెక్సాస్‌ విలవిల్లాడుతోంది. హరికేన్‌ దెబ్బకు ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. గంటకు 130 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. ఎటు చూసినా ధ్వంసమైన ఇళ్లతో టెక్సాస్‌ మరుభూమిని తలపిస్తోంది.
హరికేన్‌ హార్వే టెక్సాల్‌లో విలయం సృష్టిస్తోంది. హార్వే కారణంగా ఇప్పటివరకు ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు. హార్వే ధాటికి హ్యూస్టన్‌, హారిస్‌ కౌంటీలలో 24 గంటల్లో 70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలులదెబ్బకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. సుమారు మూడు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. 
అయితే హార్వే విలయం ఇంకా ముగియలేదు. రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వంద సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు.. హరికేన్‌ విధ్వంసానికి కుప్పకూలిన చెట్లు, విద్యుత్తు స్తంభాలను తొలగించడానికి రెండు వేల మంది సైనికులను రంగంలోకి దించారు. హార్వే ధాటికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహకరించడానికి, కనిపించకుండా పోయినవారిని వెదకడానికి, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మరో వెయ్యిమంది సహాయక సిబ్బందిని ఏర్పాటు చేశారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com