ఇక పై పెద్ద సినెమాలుకు ఆడియో ఫంక్షన్ లేన్నట్టే
- August 31, 2017
మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ మూవీ పట్ల అభిమానుల్లో అంచనాలు తారాస్థాయి లో నెలకొని ఉన్న సంగతి తెల్సిందే. మురగదాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా కానుకగా తెలుగు , తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ కి సంబదించిన ఆడియో వేడుక లేదని సమాచారం. ఇటీవల తెలుగు చిత్రాల ఆడియో లు డైరెక్ట్ గా మార్కెట్లోకి వచ్చి అలరిస్తున్నాయి. అది రీతిలో స్పైడర్ ఆడియో కూడా నేరుగా మార్కెట్లోకి రాబోతున్నాయట. కాకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మాత్రం సెప్టెంబర్ 16న కానీ.. 17నకానీ హైద్రాబాద్ లోని శిల్ప కళా వేదికలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.
కానీ తమిళ్ ఆడియో మాత్రం ముందుగా అనుకున్నట్లే సెప్టెంబర్ 9న గ్రాండ్ గా జరగనుందని తెలుస్తోంది. అయితే.. అదే రోజు తెలుగు ఆడియోను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఇప్పటికే స్పైడర్ ప్రమోషన్ పెద్దగా లేదని ఫీల్ అవుతున్న మహేష్ అభిమానులు ఇప్పుడు ఆడియో కూడా లేదంటే ఎలా ఫీల్ అవుతారో చూడాలి. దాదాపు 120 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ మూవీ లో మహేష్ కు జోడిగా రకుల్ ప్రీతీ సింగ్ నటించగా విలన్లు గా భరత్ , ఎస్ . జె . సూర్య లు నటించారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







