జగన్ ముఖ్యమంత్రి కావడం కలలోనే అంటున్న కొల్లు రవీంద్ర
- August 31, 2017
కడపను ప్రత్యేక రాష్ట్రం చేస్తే తప్ప జగన్ ముఖ్యమంత్రి కావడం కష్టమని వైకాపా నాయకులే నవ్వుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. విజయవాడ నగర తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాల ఫలితమే రేపు కాకినాడలో పునరావృతం కాబోతోందన్నారు. ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసురుతున్న జగన్.. ముందు పులివెందులలో రాజీనామా చేసి గెలవాలని చెప్పారు. నంద్యాలలో కోట్లు ఖర్చు చేసిందీ.. పోలీసులకు దొరికిందీ ఎవరో ప్రజలకు తెలుసన్నారు.
డేరాబాబా గతే జగన్ బాబాకు త్వరలో పట్టబోతోందని చెప్పారు. రోజా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రజలకు అంత మంచిందన్నారు. వెనకబడిన తరగతులకు వివాహం కోసం రూ.25వేల ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







