దుబాయ్ నుంచి అజ్మాన్ బస్సుకు 12 ధిర్హాంలు... వైఫై మరియు సినిమాలు ఉచితం
- September 04, 2017
యు.ఏ.ఈ: తరచుగా దుబాయ్ కు ప్రయాణించే అజ్మాన్ నివాసితులకు ఒక మంచి వార్త ఇది అజ్మాన్ యొక్క ముస్సా ప్రాంతం నుండి నేరుగా అల్ రషిడియ మెట్రో స్టేషన్ కు ప్రయాణికులను చేరవేసేందుకు ఒక కొత్త బస్సు సేవను ప్రారంభించారు. అంతేకాక,ఈ బస్సులో ఉచిత వైఫై సౌకర్యం సైతం ఉంది. అజ్మాన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏ పి టి సి ) వద్ద రవాణా కార్యకలాపాల యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒమర్ మొహమ్మద్ లూటా, " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ "తాజా సాంకేతికతను కలిగి ఉన్న ఏడు బస్సులను ఈ ప్రయాణ సేవకు కేటాయించామన్నారు. ఉచిత వైఫై తో పాటు, ప్రయాణికులు ఇందులో కూర్చిని సినిమాలు చూడవచ్చు. వారి సీట్లు ముందు ఒక తెరపై వార్తలను చదువుకోవచ్చు . ప్రతి ప్యాసింజర్ సౌలభ్యం కోసం ప్రతి సీటు వెనుక భాగంలో తెర ఉంచుతారని ఆయన తెలిపారు. దుబాయ్ టిక్కెట్లకు అజ్మాన్ ధర 15 ధిర్హాంలు కాగా , దుబాయ్ నుంచి అజ్మాన్ టిక్కెట్ల ధర 12 ధిర్హాంలుగా నిర్ణయించారు. అజ్మాన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏ పి టి సి ) ఒక్కో బస్సుని మూడున్నర లక్షల దిర్హామ్ లను వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ బస్సులో 50 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. ప్రతి 30 నిమిషాలకో మారు ఈ మార్గంలో ఈ బస్సులు ప్రయాణించనున్నాయి. ఏ పి టి సి ప్రస్తుతం 60 బస్సులను నడుపుతుందని ఆయన అన్నారు. "అజ్మాన్ లో అన్ని బస్ స్టాప్ లలో ఎలక్ట్రానిక్ తెరలను కలిగి ఉంటాయి, ఇవి బస్సులు వచ్చే తేదీలు మరియు సమయాలను మరియు తరువాతి బస్సు రాబోయే సమయాన్ని ఎప్పటికప్పుడే సూచిస్తాయి. లూతా అంచనా ప్రకారం, మొదటి పబ్లిక్ రవాణాని ఉపయోగించుకొనే వినియోగదారుల సంఖ్య క్రమేపి పెరిగింది ఈ సంవత్సరం ప్రస్తుత సీజన్ లో 1 లక్షా 30 వేల మంది ప్రయాణీకులు ప్రజా రవాణాను ఉపయోగించారు - గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ రవాణా వ్యవస్థలో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య 22 శాతం పెరుగుదల ఉన్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు







