గ్రీక్‌ ట్యాంకర్‌ క్రూమెన్‌ని రక్షించిన సౌదీ టీమ్‌

- September 04, 2017 , by Maagulf
గ్రీక్‌ ట్యాంకర్‌ క్రూమెన్‌ని రక్షించిన సౌదీ టీమ్‌

 సౌదీ అరేబియా: సౌదీ ఎమర్జన్సీ టీమ్‌, గ్రీక్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ నుంచి క్రూ మెంబర్‌ని రక్షించడం జరిగింది. రెడ్‌ సీ నుంచి అతన్ని వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. షిప్‌ కప్టెన్‌, జెడ్డా కోఆర్డినేషన్‌ సెంటర్‌ని సంప్రదించడంతో వెంటనే సౌదీ ఎమర్జన్సీ టీమ్‌ రంగంలోకి దిగింది. బాధితుడ్ని ఫిలిప్పినోకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కెప్టెన్‌ సహాయం ఆర్థించాడు. సౌదీ బోర్డర్‌ గార్డ్‌ టీమ్‌, మెడికల్‌ స్టాఫ్‌ కింగ్‌ ఫవాద్‌ మెరైన్‌ బేస్‌ - వాజ్‌ నుంచి 80 నాటికల్‌ మైళ్ళ దూరంలో ఉన్న షిప్‌ వద్దకు వెళ్ళారు. సౌదీ రెడ్‌ క్రిసెంట్‌ కమిషన్‌ ద్వారా వాజ్‌ జనరల్‌ ఆసుపత్రికి అతన్ని తరలించి వైద్య చికిత్స అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com