పావులు కదిపి భారీ బహుమతి సొంతం చేసుకోండి

- September 04, 2017 , by Maagulf
పావులు కదిపి భారీ బహుమతి సొంతం చేసుకోండి

చదరంగలో క్వీన్స్ పజిల్‌ను కంప్యూటర్ ద్వారా పరిష్కరిస్తే ఒక మిలియన్ డాలర్ బహుమతిగా ఇస్తామని అమెరికాలోని క్లే మేథమేటిక్స్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.  ఈ పజిలో చెస్ బోర్డు మీద ఎనిమిది క్వీన్లను ఒకదానితో ఒకటి దాడి చేయకుండా అమర్చాలి.  సాధారణ చెస్ బోర్డుపై ఈ సమస్యను పరిష్కరించడం కుదురుతుందని, అయితే గడుల సంఖ్య పెరిగే కొద్దీ పజిల్ క్లిష్టంగా మారుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.  ఉదాహరణకు 1000 బై 1000 చెస్‌బోర్డు మీద ఈ క్వీన్ పజిల్‌ను పరిష్కరించడానికి కొన్ని ఏళ్ల సమయం పడుతుందని ఇనిస్ట్యూట్ వారు చెబుతున్నారు.  అందుకే తక్కువ సమయంలో అన్ని రకాల చెస్ బోర్డుల మీద ఈ పజిల్‌ను పరిష్కరించగలిగే కోడ్ రాసిన వారికి మిలియన్ డాలర్ల బహుమతి ఇస్తామని వారు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com