డొమెస్టిక్ వర్కర్స్‌కి బ్యాంక్ గ్యారంటీ ఉపసంహరణ
- September 04, 2017
కువైట్: భారత ప్రభుత్వం, 2,500 అమెరికా డాలర్ల బ్యాంకు గ్యారంటీని ఉపసంహరించుకుంది. భారతీయ మహిళా డొమెస్టిక్ వర్కర్స్‌కి సంబంధించి, ఈ బ్యాంకు గ్యారంటీ ఇప్పటిదాకా తప్పనిసరి. కువైట్‌లో డొమెస్టిక్ రంగంలో పనిచేసేవారికి ఇదొక ఆర్థిక భారంగా మారింది. దాంతో, భారత ప్రభుత్వం ఈ ఉపశమన చర్య తీసుకుంది. ఇంకో వైపున, ఆరు ప్రభుత్వ రంగ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు మాత్రమే రిక్రూట్‌మెంట్‌ని పరిమితం చేయడం జరిగింది. నాన్ రెసిడెంట్ కేరలైట్స్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్, తిరువనంతపురం, కేరళ, ఓవర్సీస్ డెవలప్‌మెంట్ మరియు ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ కన్సల్టెంట్స్ లిమిటెడ్, తిరువనంతపురం, కేరళ, ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, చెన్నయ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, కాన్పూర్, తెలంగాణ ఓవర్సీస్ మేన్ పవర్ కంపెనీ, హైద్రాబాద్ మరియు ఓవర్సీస్ మేన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఆ ఆరు సంస్థలు. రెండేళ్ళ క్రితమే, 2500 అమెరికా డాలర్లు (720 కువైట్ దినార్స్) బ్యాంకు గ్యారెంటీగా మహిళా డొమెస్టిక్ వర్కర్స్‌కి విధించింది. కువైట్ అథారిటీస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం, అలాగే ఫిమేల్ ఇండియన్ డొమెస్టిక్ వర్కర్స్ - కువైట్ నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో దాన్ని భారత ప్రభుత్వం ఉపసంహరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







