అల్సర్‌ను అరికట్టే బాదం..!
- September 04, 2017
ఆధునిక జీవితంలో ఆహారంలో మార్పులు, పని ఒత్తిడి, రాత్రింబవళ్లు శ్రమించడం, నిద్రలేమి, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, అకాలభోజనం వంటి కారణాలతో అల్సర్ ఏర్పడుతుంది. ఆకలేసినప్పుడు ఆహారం తీసుకోకుండా.. ఎప్పుడుపడితే అప్పుడు తీసుకోవడం అల్సర్‌కు కారణమవుతుంది.
అల్సర్‌తో ఇబ్బందులు పడే వారు బాదం పప్పుతో చేసే ఔషధాన్ని తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. బాదం పొడి, నెయ్యి, పాలు, పంచదారను కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే అల్సర్ నయం అవుతుంది. ఉదరంలో ఆమ్లాలను తగ్గిస్తుంది.
అలాగే సగ్గుబియ్యంతో గొంతులో మంటను దూరం చేసుకోవచ్చు. సగ్గుబియ్యం, పెరుగు, ఉప్పును తీసుకోవాలి. ఉడికించిన సగ్గుబియ్యంలో కాసింత ఉప్పు, పులుపెక్కని పెరుగును చేర్చి..బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఓ పూట తీసుకుంటే అల్సర్‌తో ఏర్పడే గొంతు మంటను దూరం చేసుకోవచ్చు. యూరీనల్ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. సగ్గుబియ్యం ఉదర సంబంధిత రుగ్మతలను నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







