తెలుగు దర్శకునికి కీలక పదవి

- September 04, 2017 , by Maagulf
తెలుగు దర్శకునికి కీలక పదవి

ఆస్కార్‌ అవార్డుల 50 ఏళ్ల చరిత్రలో ఫారిన్‌ కేటగిరి విభాగంలో సినిమా ఎంపిక కోసం ఏర్పాటైన ఇండియా జ్యూరీ అధ్యక్షుడిగా తెలుగువారికి తొలిసారిగా స్థానం దక్కింది. సీనియర్‌ దర్శక నిర్మాత సీవీ రెడ్డి ఆ ఈ జ్యూరీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆయన చిత్రాలు నిర్మించిన ఆయన 2012లో ఇదే జ్యూరీలో సభ్యుడిగా పనిచేశారు.

రాష్ట్ర, జాతీయ స్థాయి చలనచిత్ర అవార్డుల కమిటీల్లో పలు కీలక పదవులను నిర్వహించారు. ఆయనకు ఈ పదవికి ఎంపిక కావడంపై తెలుగు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీవీ రెడ్డి అధ్యక్షతన ఫారిన్‌ ఫిలిం కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు కోసం సినిమాను ఎంపిక చేసేందుకు జ్యూరి సభ్యులు సిద్ధమవుతున్నారు. ఈనెల 16 నుంచి హైదరాబాద్‌లో సినిమాల స్క్రీనింగ్‌ మొదలు కానుంది. భారతీయ భాషాల సినిమాల నుంచి వచ్చిన ఎంట్రీలో ఒక సినిమాను ఆస్కార్ కు పంపేందుకు ఎంపిక చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com