'అర్జున్ రెడ్డి' ని ఇంకాస్త పొడిగిస్తున్నారట

- September 05, 2017 , by Maagulf
'అర్జున్ రెడ్డి' ని ఇంకాస్త పొడిగిస్తున్నారట

యూత్ లో పిచ్చ క్రేజీని రెచ్చగొట్టిన అర్జున్ రెడ్డి మూవీకి మారో ప్లస్ పాయింట్ రాబోతోందని టాక్.. ఈ మూవీకి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుండడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ..మరో 40 నిముషాల సన్నివేశాలను జోడించాలని అనుకుంటున్నట్టు హీరో విజయ్ దేవరకొండ తెలిపాడు.
ఇప్పటికే ఈ చిత్రం నిడివి 3 గంటలుండగా, మరి కాస్త పొడిగిస్తే ఎలా ఉంటుందని సందీప్ భావిస్తున్నట్టు ఈ హీరో చెప్పాడు. అటు-ఈ సినిమా తమిళ హక్కులను ధనుష్ దక్కించు కున్నాడని టాక్ వినిపిస్తుండగా.అదే సమయంలో...దీన్ని హిందీలో రీ-మేక్ చేసి,, విజయ్ రోల్ లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటిస్తాడని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com