27న బెజవాడకు తెలంగాణ సీఎం
- September 05, 2017
కనకదుర్గమ్మకు ముక్కు పుడక సమర్పించనున్న కేసీఆర్
ఢిల్లీ నుంచి రాగానే పర్యటన ఖరారు
విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి మొక్కును తీర్చుకోవడానికి సీఎం కేసీఆర్ ఈనెల 27వ తేదీన విజయవాడ వెళ్లనున్నట్లు తెలిసింది. కుటుంబ సమేతంగా అమ్మవారికి ముక్కు పుడకను సమర్పించనున్నారు. ఇప్పటికే వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, తిరుపతి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి ముక్కు పుడక, కురవిలోని వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మొక్కులు తీర్చుకుంటానని కేసీఆర్ ప్రకటించగా.. అందుకోసం రాష్ట్రం వచ్చిన తర్వాత రూ.59 లక్షలు కేటాయించారు. ఇందులో భాగంగా అన్ని దేవాలయాలను దర్శించుకున్న ఆయన ఒక్క విజయవాడలో అడుగుపెట్టలేదు.
గతేడాదే పర్యటన ఉంటుందని భావించినప్పటికీ కుదరలేదు. సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చాక విజయవాడ పర్యటనను ఖరారు చేయనున్నారు. ఈనెల 27న ఏపీ ప్రభుత్వం కూడా కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనుంది. అదే రోజు సీఎం కేసీఆర్ కూడా ముక్కు పుడకను సమర్పించి.. మొక్కు తీర్చుకోను.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







