హైదరాబాద్‌లో 'స్పైడర్' ప్రీరిలీజ్ ఫంక్షన్

- September 07, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో 'స్పైడర్' ప్రీరిలీజ్ ఫంక్షన్

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. సూపర్‌స్టార్‌ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 9న చెన్నైలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అలాగే సెప్టెంబర్‌ 15న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో చేయనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్‌ 27న దసరా కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com