నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినం
- September 07, 2017
ఐక్య రాజ్య సమితి ( యునైటెడ్ నేషన్స్ ) అంతర్జాతీయ అక్షరాస్యత దినం ప్రతి ఏటా ప్రజల అవగాహన కల్పించడం కోసం మరియు ప్రపంచంలో అక్షరాస్యత లేకపోవటం వల్ల వచ్చే సమస్యల గూర్చి తెలియచేస్తూ ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 8 న అంతర్జాతీయ అక్షరాస్యత దినం గా జరుపుకుంటున్నాము.యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో), దాని భాగస్వాములు అంటువ్యాధులలో మరియు హెచ్ ఐ వి , క్షయ మరియు మలేరియా వంటి అంటువ్యాధులు మీద అవగాహన కల్పించడానికి, ఆరోగ్యకరమైన సమాజ కల్పనకు అక్షరాస్యత ప్రాముఖ్యతను వివరిస్తూ ఈరోజును అంతర్జాతీయ అక్షరాస్యత దినంను ప్రోత్సాహించడం ప్రారంభించారు. ‘అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం’ 1966 నుండి ఏటా సెప్టెంబర్ 8న నిర్వహిస్తున్నారు. యూనెస్కో ఈ దినోత్సవానికి మార్గదర్శకత్వాన్నిస్తుంది. ప్రపంచంలో పిల్లల విద్యతో పాటు వయోజనుల విద్య మీద కూడా దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని ఈ దినోత్సవం గుర్తుచేస్తుంది.సర్వేల ప్రకారం ప్రతి 5మంది పెద్దలలో ఒకరికి అక్షర జ్ఞానం లేదు. ప్రతి ముగ్గురు మహిళలలో ఇద్దరికి అక్షర జ్ఞానం లేదు. ఎందరో పిల్లలు పాఠశాలలకు దూరంగా జీవితం గడుపుతున్నారు. అందువల్ల పిల్లల విద్యతో పాటు, వయోజనుల విద్యా సౌకర్యాల గురించి కూడా ఆలోచించాలి.అందరిలోనూ విద్యాజ్యోతిని వెలిగించాలి. ఈ విషయాలను యునెస్కో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాల, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విద్యా సౌకర్యాల కోసం కృషి చేస్తుంది.1990 ని అక్షరాస్యతా సంవత్సరంగానూ, 2003-12 దశాబ్దాన్ని అక్షరాస్యతా దశాబ్దంగానూ ప్రకటించి యూనెస్కో అందరి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లింది. ప్రతి సెప్టెంబర్ 8న ప్రపంచం నలుమూలలా ‘అక్షరాస్యత దినోత్సవం’ విద్యా దీపాలను వెలిగిస్తుంది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లయినా నిరక్షరాస్యత శాపం నుండి ఈ దేశం విముక్తి కాలేదు.దేశంలో మూడింట రెండొంతులు ప్రజలు నేటికీ ప్రాధమిక విద్య గడప దాటలేదు. నిరక్షరాస్యత ఉన్న మన దేశంలో నగదు రహిత సమాజంగా మార్చాలని అంటున్నారు. అంటే ఆర్థిక లావాదేవీల్లో నగదు అనేదే ఉండదు.. లేదా అతి స్వల్పంగా ఉంటుంది. లావాదేవీలన్నీ చెక్కు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇ-వ్యాలెట్ వగైరా ద్వారా జరుగుతాయి. చాయి దుకాణం నుండి టీ లేక పానీపూరీ వాడి నుండి పానీపూరీలు కొనుగోలులో కూడా నగదు ఉండకూడదు. చాయివాలాకి కూడా క్రెడిట్ కార్డు లేక నెట్ బ్యాకింగ్ ద్వారానే చెల్లింపు జరగాలి. జపాన్ లాంటి ఆధునిక సాంకేతికం ఉన్న దేశం, పశ్చిమ ఐరోపా లాంటి అభవృద్ధి చెందిన సమాజాలు, ఇంకా చెప్పాలంటే అమెరికా లాంటి అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశంలో కూడా నేటికీ సాధ్యం కానిది అటువంటిది ఆ దిశగా ప్రజలను అధికారులు నడిపించాలని వారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోమని ఆహ్వానించారు.దేశంలో 90 శాతం ప్రజల దగ్గర ఏ మొబైల్ ఫోన్‌తోనైతే నెట్ బ్యాంకింగ్ సాధ్యమో ఆ ఫోన్లు లేవు. ఇక చెక్కు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడటానికి తప్పనిసరిగా కావల్సిన బ్యాంకు ఖాతా 50 శాతంమందికి లేదు. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ 90శాతం ప్రజలకు బ్యాంకు ఖాతాలు లేవు. మరోవైపు నగదు రహిత సమాజం నిర్మించటానికి ముందు అందరికీ బ్యాంకు ఖాతా, చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ కావాలనేది నేతలు వక్కాణిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







