ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత, గాయకుడు కన్నుమూత
- September 08, 2017
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత, గాయకుడు ఆర్.ఎన్. సుదర్శన్ (78) కన్నమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. సుదర్శన్ దాదాపు 250కు పైగా చిత్రాల్లో పనిచేశారు. ఆయన తన ఐదు దశాబ్దాల సినీ కెరీర్లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషా చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
విలక్షణ నటుడు కమల్‌హాసన్ నటించిన 'నాయకుడు'లో సుదర్శన్ విలన్ పాత్రలో కనిపించారు. 2010లో ఉపేంద్ర తెరకెక్కించిన కన్నడ చిత్రం 'సూపర్' ఆయన చివరి చిత్రం. సుదర్శన్ పలు ధారావాహికల్లోనూ నటించారు.
సుదర్శన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నటీమణులు రాధిక, సుమలత ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ట్వీట్లు చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







