ఎలక్షన్ల లెక్కలు తేల్చుకుంటున్న చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్
- September 10, 2017
`జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య మంచి అవగాహన ఉంది. వాళ్లిద్దరూ దోస్తులే` అనే విషయం రాజకీయాల గురించి అవగాహన ఉన్న ప్రతిఒక్కరికీ తెలిసిందే! 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన తర్వాతి నుంచి వీరి మధ్య ప్రత్యేక మైన అనుబంధం కొనసాగుతోంది. అయితే 2019 ఎన్నిక ల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుందని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో.. ఎన్ని సీట్లలో పోటీచేస్తుందనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఎన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు నిలబడతారనే ప్రశ్నకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోందట. మొత్తం 25 స్థానాల్లో జనసేన పోటీచేసేలా సీఎం చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారట.
2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినా.. ఎవరికి వారు సొంతంగా బలాన్ని పెంచుకునేందుకు వ్యూహాలు మాత్రం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 175 నియోజకవర్గాల్లోనూ గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్.. ప్రత్యేకంగా సిద్ధమవు తున్నారు. అయితే టీడీపీకి అన్ని విధాలా మద్దతుగా నిలుస్తున్న పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీచేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో ఏపీలో అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పోటీ చేస్తుందా? తెలంగాణ సంగతేంటి.? ఇలా అనేక ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
జనసేన ఎన్ని సీట్లలో పోటీచేయాలో నిర్ణయించేది మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబే అని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే పవన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో. ఎప్పుడు ఎలా ముందుకెళ్లాలో.. అన్నింటినీ తానే దగ్గరుండి చూస్తున్నారు చంద్రబాబు! కల్యాణ్‌ని నడిపిస్తున్నది చంద్రబాబే అనే విషయం ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఈ తరుణంలో జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయాన్ని నిర్ణయించేది కూడా ఆయనే! ఆయన లెక్కల ప్రకారం మొత్తం 25 సీట్లను జనసేనకు కేటాయించనున్నారట.జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సైతం 50 సీట్లకు మించి పోటీ చేయాలనే ఆలోచనతో ఏమీ లేకపోవడం గమనార్హమిక్కడ.
అయితే, తెలంగాణలో కొన్ని సీట్లలో అయినా పోటీ చేయాలన్నది పవన్‌కళ్యాణ్ ఆలోచనగా కన్పిస్తోంది. పవన్ కోటాలో, చంద్రబాబు ఓ రెండు మూడు సీట్లను గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో జనసేనకు కేటాయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏపీ, తెలంగాణల్లో మరీ ఇంత తక్కువగా 25 సీట్లకే జనసేన పరిమితమైతే, అదీ పోటీ చేసే స్థానాల విషయంలో అయితే, జనసేన కార్యకర్తలు మాత్రం కొద్దిగా నిరాశ చెందే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







